సమ్మక్క సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ను ఆహ్వానించిన. మంత్రి సీతక్క
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జనవరి6
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజుకు హైదరాబాద్ అసెంబ్లీ హాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క),ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మేడారం సమ్మక్క–సారక్క జాతరకు హాజరుకావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.ఎమ్మెల్యే కే. ఆర్. నాగరాజు స్పందిస్తూ మంత్రి సీతక్క ఆహ్వానం మేరకు తప్పకుండా వెళ్తానని తెలిపారు. సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని అన్నారు.