
telugu galam news e69news local news daily news today news
లెనిన్ శత వర్ధంతి సభలో పిలుపునిచ్చిన, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. జే. రమేష్
సమ సమాజ నిర్మాణం కోసం కార్మిక, కర్షక ఐక్యత అనివార్యమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు.సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బండారు చందర్రావు భవన్ నందు కామ్రేడ్ లేనిన్ శత వర్ధంతి సభ జరిగింది. లేనిన్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి అధ్యక్షతన జరిగినది సభలో ఏ.జే.రమేష్ మాట్లాడుతూ లెనిన్ చనిపోయి 100 సంవత్సరములు గడచిన గాని ప్రపంచవ్యాప్తంగా లెనిన్ రచనలు కార్మిక, కర్షక, సకల ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఆయన జీవించిన కాలం కేవలం 54 సంవత్సరాలు అయినా గాని రష్యాలో సోషలిజం జయప్రదం కోసం నిరంతరం శ్రమించి అక్కడ సోషలిజం దేశంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఆనాడు 1917లో రష్యాలో సోషలిజం జయప్రదమై అక్కడ ప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఆయన బతికిన కాలం ఏడు సంవత్సరాలు అయినా 1990 వరకు సుమారుగా 73 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న బడుగు బలహీన దేశాలకు ఎంతో ఆర్థిక తోడ్పాటు అందించి ప్రపంచం మొత్తం సమ సమాజం ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి లెనిన్ రచనలు నేటికీ అనేక దేశాలలో అనేక వర్గ ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఈనాడు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ దేశాలు సంపద మొత్తం కూడగట్టుకుని ఒక్క శాతంగా ఉన్నటు వంటి వారు 99 శాతం గా ఉన్న ప్రజలని పీల్చిపి ప్పిచేస్తూ వారు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారని ఇటువంటి సమాజాన్ని రాబోయే కాలంలో ప్రజలు విశ్వసించరు అని ఏనాటికైనా మార్పు అనివార్యమని సమ సమాజం కోసం ప్రజలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. కావున ఇప్పటికైనా పాలకులు పక్షపాత ధోరణిని విడనాడి అందరికీ కూ డు, గుడ్డ , చదువు, వైద్యం, సమస్థాయిలో అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కమిటీ సభ్యులు ,డి లక్ష్మి ,ఎన్ నాగరాజు ,కోరాడ శ్రీను , భూపేందర్ ,మరియు నాగలక్ష్మి ,కనక వేణి ,ఆది, శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.