
సమ సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి
సమాజ మార్పు కోసం, సమ సమాజ నిర్మాణం కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే కుళ్లు రాజకీయాలకు స్వస్తి పలుకుతారని, నవ సమాజ నిర్మాణానికి దోహదపడతారని ఆయన పేర్కొన్నారు.జనగామ పట్టణానికి చెందిన చింతకింది అజయ్ కుమార్,కుర్రముల శ్రీకాంత్ ఈరోజు సిపిఎం పార్టీ లో చేరారు.వారిని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజా సమస్యలు అధికంగా పేరుకుపోయినా పట్టించుకునే వారు లేరని విమర్శించారు.యువత పార్టీ లో చేరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే సమాజ మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి,పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్,నాయకులు పంతం సాయి ప్రసాద్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.పార్టీలో కొత్తగా చేరిన యువతతో సిపిఎం మరింత బలోపేతం అవుతుందని,వారి పోరాట పంథా పార్టీకి శక్తివంతమైన బలంగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.