
ఈ69న్యూస్ జనగామ
బహుజన విప్లవ వీరుడు మొగుల్ సామ్రాజ్య పాలకులను తరిమి కొట్టిన యోధుడు బడుగు బలహీన వర్గాల మహారాజ్ సర్ధార్ సర్వాయి పాపన్న 315 వ వర్ధంతి సందర్భంగా కెజికెఎస్ జనగామ జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జొన్నగోని శ్రీనివాస్,బండపల్లి శంకరయ్య,జిల్లా కమిటీ సభ్యులు బస్వగాని మహేందర్,బుషిగంపల సమ్మయ్య,బైరగోని వెంకటయ్య,యదండ్ల పరంధమ,కుర్ర రాజు,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్,తాళ్ళపల్లి మహేష్,ఉజ్వల్ గౌడ్ పాల్గొన్నారు.