పారిశుధ్య కార్మికులకు 20వేలు అందజేత
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 014
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ గ్రామ పంచాయతీ 5గురు పారిశుద్ధ్య కార్మికులకు తలో 5000 చొప్పున మొత్తం 20వేల రూపాయలు అందజేసి సర్పంచులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ..గ్రామ పారిశుధ్య కార్మికులు విపరీత సేవలు చేస్తున్నారని,వారికి వచ్చే ప్రభుత్వ జీతం,అంతంత మాత్రంగానే ఉండడం వలన వారి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని అందుకోసమే వారు సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవడం కోసం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులు, స్థానిక సర్పంచ్ ఉదారతకు,ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ షరీఫ్ వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.