
సామాజిక న్యాయమా! రాజకీయ పతనమా!! తెలుసుకోవాలి!!! ఏపూరి
సామాజిక న్యాయమా రాజకీయ పతనమా పాలక పక్షాలు తెల్చుకోవాలని ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వరావు మాదిగ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని బిజెపి సామాజిక న్యాయాన్ని విస్మరిస్తే భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని ఏపూరి డిమాండ్ చేశారు. సోమవారం తల్లాడ మండల కేంద్రంలో ఎంఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక్కరోజు దీక్ష శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వర్గీకరణ విషయాన్ని తేల్చడం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బిజెపి పార్టీ వర్గీకరణ చేయకుండా ఆకలను నిజం చేసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వర్గీకరణ విషయంలో మాదిగ, మాదిగ ఉపకులాలను మోసం చేశాయని రాబోయే ఎన్నికలలో ఆ పార్టీలకు బుద్ధి చెప్పి మహాజన సోషలిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలకు ఆద్యుడు మందకృష్ణ మాదిగ మాత్రమేనని భవిష్యత్తులో కూడా పేద ప్రజల పక్షాన పోరాడేది మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మెస్సీ మాత్రమేనని పేర్కొన్నారు. వర్గీకరణకై జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 20న నియోజకవర్గంలో, 21, 22న కలెక్టరేట్ కార్యాలయం ముందు దీక్షలు, 23న కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో ఎంఎస్పీ జిల్లా నాయకులు దారెల్లి వెంకటేశ్వరరావుమాదిగ, కోట బలరాం మాదిగ, ఇస్నేపల్లి అశోక్ మాదిగ, ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు కొండ ముదిరాజ్, వెంకటరత్నం, ఎక్కిరాల మోహన్, షేక్ నాగుల్ మీరా, కృష్ణ, అశోక్, సునీల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.