
*సింగరాజుపల్లి గ్రామంలో దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు*
జనగామ/దేవరుప్పుల
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కొంగరి మురళి అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథిగా బహుజన్ సమాజ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాపాక శ్రీశైలం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు అంబేద్కర్.దేశానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి,అన్ని సామాజిక వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చే బాధ్యత ఈ రోజు యువతపై ఉంది,”అన్నారు.అలాగే,ఈ రోజు పేదవారు అన్ని రంగాల్లో ఎదగగలగటానికి రాజ్యాంగమే ప్రధాన కారణమని,అందరూ కలసి రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగి ఉన్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాపాక సురేందర్,రాపాక కృష్ణ,రాపాక సంతు,రాపాక మహేష్,తల్లపల్లి శ్రీదర్,సంఘీ పరందములు తదితరులు పాల్గొన్నారు.