బొజ్జ ఆశన్న CITU జిల్లా అధ్యక్షులు
వెల్ఫేర్ బోర్డు స్కీమ్లను ఇన్యూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించాలి
బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలి
సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలి
పెన్షన్, సహజ మరణానికి రూ.5 లక్షలు, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
CITU డిమాండ్:
బొజ్జ ఆశన్న CITU జిల్లా అధ్యక్షులుతెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం సిఐటియు రాష్ట్ర కార్యాలయంహైదరాబాద్, తేదీ:నవంబర్ 10, 2025 నా జరిగింది.తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకూడదని, ఇప్పటికే ఇచ్చిన ₹346 కోట్ల నిధులను వెంటనే మండలి ఖాతాలో జమ చేయాలని, ఆ కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ అనుమతులను రద్దు చేయాలని తెలంగాణ బిల్డింగ్&అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సి ఐ టి యూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో మాట్లాడిన సి ఐ టి యూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న మాట్లాడుతు….కార్మికుల సంక్షేమ నిధులు ప్రజల సొమ్ము. వాటిని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం అన్యాయం. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని, నిధులను భద్రపరిచి, కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి.
సమావేశంలో నాయకులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను సమర్థంగా అమలు చేయాలని, ప్రభుత్వం కార్మికుల హక్కులను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.