
వామపక్ష కార్మిక ఐక్యతకు విఘాతం కలిగిస్తూ గొడవలు సృష్టిస్తున్న సిహెచ్ రాజారెడ్డి పద్ధతి మార్చుకోవాలి
సిఐటియు జెండాను తొలగించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
—సీఐటీయూ జనగామ పట్టణ కన్వీనర్ సుంచు విజేందర్~~
జనగామ: వామపక్ష కార్మిక వర్గఐక్యతకు విఘాతం కలిగిస్తున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజిరెడ్డి తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని సిఐటియు జనగామ పట్టణ కన్వీనర్ సుంచు విజేందర్ మండిపడ్డారు
. గురువారం రోజున పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజేందర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల కాలంగా షాప్ & గ్రెన్ మార్కెట్ హమాలి యూనియన్ సిఐటియూ అనుబంధంతో ఉందని దీనికి వ్యవస్థాపక అద్యక్షులుగా ఆకుల పెంటయ్య స్థాపించిన షాప్స్& గ్రెన్ మార్కెట్ యూనియన్ లో రాజి రెడ్డి చేరి తన స్వార్థ ప్రయోజనాల కోసం హమాలి కార్మికులకు మాయమాటలు చెప్పి తన వైపు తిప్పుకున్నాడని సిపిఎం నుండి వెళ్లిపోయి అనేక రాజకీయ పార్టీలు మారినంత మాత్రాన జెండా గద్దెలు ఎలా మారుతాయని వారు ప్రశ్నించారు. ఆకుల పెంటయ్య గారి స్మారక స్థూపం వద్ద నూతనంగా నిర్మించిన సిఐటియు జెండా గద్దెపై ఉన్న సిఐటియు జెండాను తొలగించడం సిగ్గుచేటు అన్నారు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసుల విచారణ జరిపి రాజారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు సిపిఎం పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేసి కష్టపడి రాజారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేసి ఇతర రాజకీయ పార్టీలలోకి వెళ్లి సిపిఎం పార్టీ పెట్టిన బిక్ష వల్ల మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ తీసుకుంటున్నాడని రాజారెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యే పెన్షన్ తీసుకోకూడదని పెన్షన్ వెంటనే తిరిగి సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి తన పెన్షన్ పంపియాలని అన్నారు. రాజారెడ్డి ఎర్రజెండా పేరు చెప్పుకుంటూ రియల్ ఎస్టేట్ భూదందాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు ఇప్పటికైనా రాజిరెడ్డి సిఐటియు సిపిఎం కు క్షమాపణ చెప్పి నీతిమాలిన రాజకీయాలు మానుకొవాలని హితువు పలికారు జిల్లాలో వామపక్ష కార్మిక ఐక్యతకు విఘాతం కలిగించకుండా కృషి చేయాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు .ఈ విలేకరుల సమావేశంలో సీఐటీయూ టౌన్ కమిటీ సభ్యులు కచగళ్ల వెంకటేష్,చిదిరాల ఉపేందర్,గంగారబోయిన మల్లేష్ రాజ్,సీఐటీయూ నాయకులు తాండ్ర ఆనందం ,గాడి శివ తదితరులు పాల్గొన్నారు