సిపిఎం కు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించండి
Jangaonనవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్ధిగా మోకు కనకా రెడ్డి గారు జనగామ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు.ఈరోజు ఇంటింటి ప్రచారంలో బాగంగా జనగామ పట్టణంలోని మిషన్ కాంపౌండ్ టీచర్స్ కాలనీ బాలాజీ నగర్ జ్యోతి నగర్ గోకుల్ నగర్ అంబేద్కర్ నగర్ గిర్ని గడ్డ సంజయ్ నగరు సాయి నగర్ హౌసింగ్ బోర్డ్ బీరప్ప గడ్డ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల హక్కుల కోసం నిరంతంరం ఉద్యమిస్తున్న రైతాంగ ఉద్యమ నేత మోకు కనకారెడ్డి గారి సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి మీ ప్రతినిధినిగా అసెంబ్లీకి పంపించాలి అని కోరారు. ప్రజలు ఆదరించి గెలిపిస్తే అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు డబల్ బెడ్ రూమ్‌లో అందిస్తాము జనగామ పట్టణంలో స్వచ్ఛమైన మంచినీరును అందిస్తాం.ఉపాధికి ఇండస్ట్రియల్ క్యారిడార్ పరిశ్రమలు జనగామ పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.జనగామ పట్టణంలో ఒకటో వార్డులోని అంబేద్కర్ కాలనీలో పార్కును అభివృద్ధి చేస్తాం రంగప్ప చెరువును పర్యటక కేంద్రంగా ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేస్తాం. శాశ్వతమైన వరద నీటికి డ్రైనేజీని ఏర్పాటు చేస్తాం ముస్లిం మైనార్టీలకు శాది ఖాన జనగామ పట్టణంలో కోతులను శాశ్వతంగా షామీర్పేట దగ్గర పార్కును ఏర్పాటు చేసి అందులో వాటికి ఆశ్రయాన్ని కల్పిస్తాం.ప్రజలను కాపాడుతాం అని అన్నారు.
ఈప్రచార కార్యక్రమం లో కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహలియా సిపిఎం సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి పాము కృష్ణమూర్తి సిపిఎం జనగాం పట్టణ కమిటీ సభ్యులు సభ్యులు కళ్యాణం లింగం బాల్నె వెంకట మల్లయ్య పందిళ్ళ కళ్యాణి పల్లెల లలిత దూసరి నాగరాజు మోకు భవాని బూడిది అంజమ్మ చీర రజిత బూడిది జ్యోతి వడ్డేపల్లి బ్లెస్సింగ్ టెన్ గాడి శివ రజిత ఎండి గౌసియా నాజియా సాయి ప్రకాష్ రాజు లక్ష్మి సునీత ఎలేంద్ర జి సురేష్ పొన్నాల ఉమా తదితరులు పాల్గొన్నారు