
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం మునగాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవర వెంకటరెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అమలు జరగలేదన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం క్వింటాల్ వరి ధాన్యానికి 3500 రూపాయల మద్దతు ధర కల్పిస్తామని చెప్పి, చెయ్యకపోవడం కారణంగా అనేక మంది రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కొట్లాడి తెచ్చుకున్న ఉపాధి హామీ పథకానికి పూర్తిగా నిధులు తగ్గించి కూలీలకు పని దినాలు లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వా నీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసి నేటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయని పరిస్థితి, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11 లక్షల 50 వేల ఎకరాలకు అక్కుపత్రాలు ఇస్తామని చెప్పి కేవలం నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు దళితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదు దళితులకు గిరిజనులకు ఇవ్వవలసిన డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను పక్కనపెట్టి కొత్తగా గృహలక్ష్మి పథకం తెచ్చారు అది కూడా అర్హులకు అందే పరిస్థితి లేదు అని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ రైతు సంఘం జిల్లా నాయకులు షేక్ సైదా రావులపెంట వెంకన్న శంబయ్య బత్తిని ఉమా శంకర్ కోదాడ రామ