
ఈ69న్యూస్ హైదరాబాద్
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల భూములను అప్పగించాలని సిపిఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించిన భూములలోకి వెళ్లిన పేద మహిళల పైన సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీపై లాఠీచార్జి చేయడంతో పాటు అక్రమ అరెస్టులను చేయడాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.తక్షణమే మహిళలపై లాఠీచార్జి చేసిన మగ పోలీసులను విధుల నుండి తొలగించాలని పేదల భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని పేదలకు ఆ భూములు అప్పగించాలని కోరారు.2007 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం 700 మందికి 60 గజాల స్థలo పట్టాలను ఇచ్చిందని,ఆనాటి నుండి నేటి వరకు రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమణలో ఉన్న ఆ భూములను పేదల చేతిలోకి రాకుండా అధికారులు పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారని మా భూములు కావాలని నివాసం ఉండడానికి ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించాలని భూముల పైకి వెళ్లిన పేదలపై విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేయడం వలన అనేకమందికి గాయాలు అయ్యాయని,పిడిగుద్దులు గుద్దడంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారన్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ భూములను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.