
*ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ*
ఈనెల 13 తేదీన జరిగే సిపిఐ జిల్లా మహా సభ ను విజవంతం చేయాలనీ రేగొండ మండల కార్యదర్శి పెంట రవి పిలుపు నించారు.ఈ నెల 13 వ తేది న రేగొండ మండల కేద్రం లోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే సిపిఐ భూపాలపల్లి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు,ఈ సందర్బంగా జిల్లా మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.అనంతరం పెంట రవి మాట్లాడుతూ పేద ప్రజల ప్రక్షాళన నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అలాంటి కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాసభలను రేగొండ మండల కేంద్రంలో నిర్వహించడం సంతోషదాయకమని భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పార్టీ జిల్లా మహాసభలో చర్చించబడతయని జిల్లా మహాసభలను ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సినియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి, జిల్లా నాయకులు శాంతి కుమార్,రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటి చంద్రమౌళి, అన్నారపు రాజేందర్,చక్రపు ఆగయ్య గుర్రాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.