సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)డి.ఎస్.వెంకన్న,స్థానిక తహశీల్దార్లు వెంకటేశ్వర్లు,రాజేష్ రెడ్డితో కలిసి శివునిపల్లి జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ మరియు జఫర్ఘడ్లో ఎన్నికల సిబ్బందికి జరుగుతున్న శిక్షణ తరగతులను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ డి.ఎస్.వెంకన్న న్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని,సిబ్బంది అందరూ పారదర్శకత,నిబద్ధతతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని సూచించారు.తహశీల్దార్లు వెంకటేశ్వర్లు,రాజేష్ రెడ్డి కూడా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేస్తూ,ఎన్నికల నిర్వహణలో చట్టబద్ధంగా,క్రమశిక్షణతో పని చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది,అధికారులు పాల్గొన్నారు.