
సిరోలు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సిరోలు పోలీస్ స్టేషన్ని శుక్రవారం రోజు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆకస్మిక తనిఖీ చేశారు., ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ, హెచ్, ఆర్, ఎం, ఎస్,ఆన్ లైన్ వినియోగించు విధానము, ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయు మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మరిపెడ సిఐ రాజు, సిరోలు ఎస్సై రమాదేవి,కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.