
సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి-తొగరు రమేష్.
మునగాల మండల కేంద్రంలోని స్థానిక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొగర్ రమేష్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరక సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 20న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బహిరంగ సభను మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు సీనియర్ నాయకులు సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్,యలక నరేందర్ రెడ్డి, మునగాల, తాడ్వాయి సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, తొగర్ సీతారాములు, సర్పంచ్ లింగారెడ్డి , మాజీ జెడ్పిటిసి సభ్యులు కొల ఉపేందర్ రావు, ఉప్పుల యుగంధర్ రెడ్డి, ఉడుం కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోపిరెడ్డి నాగిరెడ్డి, పలువురు బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచులు ఎంపిటిసి సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.