
ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఐకెపి వివోఎ ల జీతాల పెంపు
ఐకెపి వివోఏ ల మరిపెడ మండల అధ్యక్షుడు రాంపల్లి వెంకన్న
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని శ్రీ దుర్గా మండల సమాఖ్య లో ఐకెపి వివోఎ ల రాష్ట్ర అధ్యక్షురాలు మారుపెల్లి మాధవి సూచన మేరకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల (వీఓఏ) ల కు ఐకెపి వివోఏ వేతనాలు నెలకు రూ. 8,000కు పెంచారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకులకు (వీఓఏ) లబ్ధి చేకూరనున్నది. సీఎం నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ.106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనున్నది. అయినా ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నారు, ఐకెపి వివోఎ ల జీవితాలలో వెలుగులు నింపారని ఏ ప్రభుత్వం కూడా చేయని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరగడం అది రక్షాబంధన్ రోజు జరగడం ఒక చెల్లికి అన్నగా బాద్యత తెలిసిన, బాధలు తెలిసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు,తమకు యూనిఫాం కోసం నిధులను అందించాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెనివల్ విధానాన్ని సవిరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, విజ్జప్తులను తక్షణమే పరిష్కరిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాగా తమకు జీవిత బీమా కూడా అమలు చేయాలనే మహిళా సంఘాల సహాయకుల విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు, తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందించాలని సీఎం నిర్ణయించారు. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెల్లకోసారి చేసే రెనివల్ విధానాన్ని ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు, వీఏఓలు తమకు జీవిత బీమా అందించాలని సీఎం కు చేసుకున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం ఇందుకు సంబంధించిన విధి విధనాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఆదేశించారు, కాగా గతంలో తమను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తీసుకున్న మానవీయ నిర్ణయంతోనే తమకు నేడు నెల జీతాలతో భరోసా దొరికిందని, తమను ఆదరిస్తూ ఆసరానందిస్తూ భరోసాగా నిలిచినందుకు సీఎంకు రుణపడి వుంటామని మహిళా సంఘాల సహాయకులు (వీఓఏ) ప్రకటించారు రాష్ట్రంలోని వివో ఏల కుటుంబాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసిఆర్ కు రుణపడి ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి వివో ఏ మరిపెడ మండలం అధ్యక్షుడు రాంపెల్లి వెంకన్న,కార్యదర్శి పచ్చిపాల మౌనిక,కోశాధికారి వనం పద్మ,సహాయ కార్యదర్శి జె శాంతి,గౌరావ సలహాదారు కొండూరు వెంకన్న,పి పద్మ, డి బిక్షమమ్మ,డి రాధ, డి సుభద్రా, వై. సుధ,సునీత,వసంత,మోతిలల్,బి వెంకన్న,మహేష్,మాహెర్నిశ, గీత,రజిత,భార్గవి,అరుణ,సువార్త, లలిత,సుజాత,మహిత పలువురు వీఏఓ మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.