
సీనియర్ నాయకుడు బొమ్మినేని వెంకట్ రెడ్డిని పరామర్శ
జఫర్గడ్ మండలంలోని కూనూర్ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ మండల కమిటీ సమావేశం పెండ్యాల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు.కేంద్రంలో ఉన్నా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై యావత్తు భారత పౌరులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ ఆరెస్సెస్ గుండాల దాడుల్లో అనేకమంది అమాయక ప్రజలను హింసలకు గురిచేసి నగ్నంగా ఉరేగించి హత్యలు చేసి మానబంగాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా అమాయక ప్రజలపై కేసులు పెట్టడం దారుణమన్నారు.మూడు నెలలుగా ఆ రాష్ట్రంలో మీడియాకు తావులేకుండా ఎక్కడికక్కడ నెట్వర్క్ బంద్ చేసి బాహ్య ప్రపంచానికి తెలవకుండా ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడిన బీజేపీకి పాలించే హక్కు లేదని ఎద్దేవా చేశారు.తక్షణమే ఆ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనా విధించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి మత కొట్లాటలకు మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందు ముస్లిం క్రిస్టియన్ తదితర మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న బీజేపీని రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసే విదంగా చేస్తున్న బీజేపీ ఆరెస్సెస్ ను విధానాలను నమ్మవద్దని దానికి మణిపూర్ హర్యానా రాష్ట్రాల్లో జరుగుతున్నా దాడులే నిదర్శనమని,
బీజేపీ హఠావో దేశ్ బాచావో నినాదంతో యువకులు బడుగు బలహినా వర్గాల ప్రజానీకం కవులు కళాకారులు మేధావులు ఆలోచించాలని ఆయన అన్నారు.అనంతరం అనారోగ్యానికి గురైన పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మినేని వెంకట్ రెడ్డిని పరామర్శించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శులు ఆకులశ్రీనివాస్,ఆది సాయన్న,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగళంపల్లి జనార్దన్ మండల కార్యదర్శి జువారి.రమేష్ నాయకులు కురపాటి చంద్రమౌళి,యాకుబ్ పాషా,జాఫర్ ముసలైయ్య మంద బుచ్చయ్య వెంకటయ్య యాకయ్య తదితరులు పాల్గొన్నారు.