సీనియర్ సిటిజన్ల కోసం లీగల్ సర్వీసెస్ సెంటర్ ప్రారంభం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం మరియు న్యాయ సహాయం అందించేందుకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీసెస్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఘనపూర్ ఆర్డీవో డి.ఎస్.వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్డీవో వెంకన్న మాట్లాడుతూ..వృద్ధులకు సంబంధించిన సంక్షేమ పథకాలు,ఆస్తి వివాదాలు,కుటుంబ సమస్యలు,పెన్షన్ తదితర న్యాయ సమస్యల పరిష్కారానికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.అవసరమైన సీనియర్ సిటిజన్లు ఎలాంటి సంకోచం లేకుండా ఈ కేంద్రాన్ని సంప్రదించి ఉచిత న్యాయ సలహాలు,సహాయం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు కూడా పాల్గొని,వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.లీగల్ సర్వీసెస్ సెంటర్ ద్వారా న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని అన్నారు.కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులు,న్యాయవాదులు,అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు