- 38వ వర్ధంతి సభలో రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో కేంద్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను
సమీకరించి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహించాలి. కార్మిక, కర్షక ఐక్యత ద్వారా మతతత్వ వ్యతిరేక పోరాటాలను ఉదృతం చేయాలని రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశంలో 1936లోనే వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి అణిచివేతకు గురౌతున్న పేదలను ఒకవేధిక పైకి తెచ్చి, కూలీ రేట్ల పెంపుదలేకాక, కుల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించారు. ఆ రోజులలోనే సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసి కుల వివక్షతపై తిరుగుబాటు చేశారు. ఆంధ్రలో అంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనేకాక, తెలంగాణలో నైజాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’కు నాయకత్వం వహించారు. చదువు రాని అనేకమందిని పోరాట నాయకులుగా తయారు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనేకాక భారత కమ్యూనిస్టు పార్టీ మార్పిస్టుకు కార్యదర్శిగా పని చేశారు. దేశంలో పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. భూ సమస్య, ఉపాధి సమస్య, సాంఘిక సమస్యలు, ప్రాంతీయ విభేదాలు తదితర అన్ని సమస్యలకు పార్లమెంట్లోనేకాక శాసన సభలలో చర్చించి అమలు చేశారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో లక్షలాది ఎకరాల భూమిన పంపిణి చేయడానికి ఈ పోరాటాలు దోహదపడ్డాయి. ప్రజలే తన సంతానంగా భావించి కృషి చేశారు. తన యావదాస్తిని పార్టీకి, పార్టీ పత్రికకు ఇచ్చేశారు. గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వేతనాలు పెంచుకోవడం, భూమిని కలిగి ఉండే విధంగా ఉద్యమాలు నిర్మించారు.
నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి భూ సమస్యను సృష్టించాయి. కార్పొరేట్లకు, ఫాం హౌజ్లలకు వందలాది ఎకరాల భూములు సేకరిస్తు పేదలను భూముల నుండి తరిమివేస్తున్నారు. ఎక్కడికి అక్కడ భూములు కొల్పోయిన ప్రజలు పెద్దఎత్తున ఉ ద్యమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమాలపై ప్రభుత్వాలు నిర్బంధం సాగించినప్పటికి సుందరయ్య స్పూర్తితో సాగిస్తున్న పోరాటాలు ఫలితాలు సాధిస్తున్నాయి. అదే సూర్తితో భవిష్యత్లో ఉద్యమాలు నిర్మించాలి.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం డాక్టర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ అంజనేయులు లు పాల్గొన్నారు.