సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల మోసాలు వెలుగులోకి వచ్చాయి.కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం ఇటీవల మృతి చెందగా,ఆమె పేరుతో వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ చెక్కును అక్రమంగా విత్డ్రా చేసి కాంగ్రెస్ నాయకులు డబ్బును కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కూతురు నసీమా వివరాలు అడగగా,మొదట రూ.50 వేల రూపాయలు ఇచ్చి మిగతా మొత్తాన్ని ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.తనకు రావాల్సిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వకుండా మోసం చేశారని బాధితురాలు వాపోయింది.అంతేకాకుండా,ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తన నుంచి రూ.5,000 తీసుకుని మోసం చేశారని నసీమా ఆరోపించారు.పేద కుటుంబాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ నాయకులు ఇలాంటి మోసాలకు పాల్పడటం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.