
Bhadradri Kothagudem Latest News in Telugu ..
సింగరేణి డైరెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన AITUC నాయకులు
సింగరేణి కొత్తగూడెం సెంట్రల్ వర్క్ షాప్ లో గత ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్న వెల్డింగు కాంట్రాక్ట్ కార్మికులకు టెండర్ల పిలవకుండా,పని లేకుండ పడేయడం సరికాదని తక్షణమే టెండర్ పిలిచి పని కల్పించాలని ఏఐటీయుసీ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు క్రిష్టాఫర్,యర్రగాని కృష్ణయ్య ల ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ ఇ అండ్ ఎం శ్రీ డి.సత్యనారాయణ రావు గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులతో పని చేయించుకొని నేడు అవసరం లేదని వారికి ఉపాధి లేకుండా చేయడం చాలా అన్యాయం అని, తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని టెండర్ ను పిలిచేటట్టుగా చూడాలని,ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జహెద్ ,మదర్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.