
సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలని సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో ‘బీసీల సింహ గర్జన’ పేరుతో 3లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చెయ్యడం జరిగిందని బైరి రవికృష్ణ, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. ఈ రోజు హన్మకొండ కాకతీయ హరిత హోటల్లో సెప్టెంబర్ 10 న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్స్ లో జరిగే బీసీ సింహం గర్జన యొక్క పోస్టర్ ను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బైరి రవికృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలని సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్ లో ‘బీసీల సింహ గర్జన’ పేరుతో 3లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు. ఈ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రములోని 33 జిల్లాల నుండి బీసీ కులాలకు చెందిన వాళ్ళు ఇంటికో వ్యక్తి, ఊరికి ఒక వాహనం ఎక్కి సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చి బీసీల సత్తా చాటలని పిలుపునిచ్చారు. మొన్న బిఆర్ఎస్ ప్రకటించిన సీట్లలో బీసీలకు చాలా అన్యాయం