*.*జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్కెట్ కమిటీ ఆధ్వ్యంలో మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ రాఘవేందర్ గారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సులో రైతులు, హమాలీలు, వ్యాపారుల సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తులు లింకు పంపిన ,ఫోన్ చేసినా కూడా స్పందించవద్దని కోరారు. అలాగే ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లయితే మోసపోయిన డబ్బు తిరిగి వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ *మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు గారు*, వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి గారు, ఘన్పూర్ ఎస్సై శ్రావణ్ కుమార్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజన్ బాబు, పెంతల రాజ్ కుమార్ గార్లు మరియు మార్కెట్ సిబ్బంది, రైతులు పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.