సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్.ఐ ఏడుకొండలు
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం మండల ఎస్.ఐ ఏడుకొండలు విద్యార్థుల కు సూచించారు.సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు ఆదేశాల మేరకు షీ-టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం ఆధ్వర్యంలో నడిగుడెం ఎస్సై ఏడుకొండలు మంగళవారం మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్. ఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు,సెల్ ఫోన్ లకు ఆకర్షితులు కావద్దని సూచించారు.విద్యార్థినిలు చదువులో ముందుండాలన్నారు. అంతకు ముందు మహిళలు, పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.షీ టీమ్స్,మహిళల భద్రత,రక్షణ,100 డైల్,సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల,భరోసా సెంటర్,టోల్ ఫ్రీ నెంబర్ 1930,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆట,పాటల ద్వారా విద్యార్థినిలకు వివరించారు. ఈ కార్యక్రమం లో సూర్యాపేట షీ టీం ఇంచార్జ్ ఏ ఎస్ ఐ పాండు నాయక్,షీ టీమ్స్ మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి,కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ వెంకట రమణ, ఏ.ఎస్.ఐ జగన్మోహన్, మహిళా హెడ్ కానిస్టేబుల్ లావణ్య, కానిస్టేబుల్ సక్రు,కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి,కృష్ణ,నాగార్జున, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.