
telugu galam news e69news local news daily news today news
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు,అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు,కోదాడ డి.ఎస్.పి ప్రకాష్,సీఐ వీర రాఘవులు,ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రం లోని మోడల్ స్కూల్లో సైబర్ నేరాలు, సోషల్ మీడియా,డ్రగ్స్ మత్తు మందులు,గంజాయి నిషేధం,పైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు మరియు పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.పోలీస్ కళాబృందం చేత సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల గురించి, టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, షీ టీమ్స్, మహిళల భద్రత, పిల్లల పైన సోషల్ మీడియా ప్రభావం మరియు విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆట, పాటల ద్వారా విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునగాల ఏఎస్సై కృష్ణమూర్తి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిశ్వరి , హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి, కానిస్టేబుల్ నిరంజన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి,నాగార్జున, కృష్ణ, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.