సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి–జూలై 4, 5 తేదీల్లో మహాసభలు విజయవంతం చేయండి
Uncategorizedప్రభుత్వ హామీల అమలు కోరుతూ గట్టి డిమాండ్ చేసిన కాడబోయిన లింగయ్య
E69NEWS ఐనవోలు,జూన్ 21
గ్రామీణ సొసైటీల పదవీకాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని,సొసైటీ ఎన్నికలు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో వెంటనే జరపాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య డిమాండ్ చేశారు.శనివారం ఐనవోలు మండలంలోని రైతువేదికలో మండల అధ్యక్షుడు పిడుగు దయాకర్ అధ్యక్షతన సంఘం మండల కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లింగయ్య మాట్లాడుతూ…ఎన్నికల ఆలస్యం సంఘాల దశను నిర్వీర్యం చేస్తోందని,ఇది అంగీకారయోగ్యం కాదన్నారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా ప్రకటించిన గొర్ల కాపరులకు రూ.2 లక్షల నగదు బదిలీ హామీని, ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల డీడీలు వాపసు తీసుకుని రైతులను మోసం చేసింది అని ఆరోపించారు.అలాగే నట్టల మందు వ్యవహారంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.”ఓడెక్కినాక బోడి మల్లయ్య అనే చందంగా,ఓట్లకు ముందు హామీలు ఇచ్చి,అధికారంలోకి వచ్చాక గొల్ల కురుమలను విస్మరించారంటూ”ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.హామీలు అమలు చేయకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
జూలై 4, 5 తేదీల్లో హనుమకొండలో మహాసభలు–ఇంటికో మనిషి, ఊరుకో బండి
లింగయ్య మాట్లాడుతూ..జులై 4, 5 తేదీల్లో హనుమకొండలో జరగనున్న జిల్లా 3వ మహాసభలను గొప్ప విజయంగా మార్చాలని పిలుపునిచ్చారు.ప్రతి గ్రామం నుండి ఓ వ్యక్తి మాత్రం హనుమకొండకు చేరుకొని “గొల్ల కురుమల సత్తా”చాటాలని,ఎదురవుతున్న సమస్యలపై చర్చించి పోరాట మార్గాలు నిర్ణయిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో నల్లబెట్ట చిన్న రాజు,పిడుగు దయాకర్,నల్లబెట్ట చిన్నరాజు తదితరులు మాట్లాడారు.అలాగే సంఘ కార్యదర్శులు,అధ్యక్షులు,కార్యకర్తలు–ఉడుత చేరాలు,సంఘీ శీను,నక్క బన్నీ,బొమ్మకంటి యాకయ్య,ఉడుత భాస్కర్,నల్లబెట్ట సురేష్,రాజారపు కొమురయ్య,ఉడుత సమ్మయ్య,కత్తుల విశ్వాస్,ఉడుత బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.