
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా
తెలుగు గళం స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ జోన్ ఇంచార్జ్ కొలిపాక సతీష్ లాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు గాని ఇచ్చిన దాఖలు లేవని అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరు చెప్పి ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందని అందులో భాగంగా మహిళలకు బస్సులలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం,గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు రూ.500 కు గ్యాస్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు,ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని కావున కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింత ఎల్లయ్య,జిల్లా కార్యదర్శి మేకల మల్లేశం,తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.