పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం. కొందుర్గు మండల కేంద్రంలో గల స్కాన్ ఎనర్జీ & పవర్ లిమిటెడ్ పరిశ్రమలో నిత్యం ప్రమాదాలు జరిగుచున్నా పరిశ్రమ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణం అని, ఇకనైనా అధికారులు స్పందించి పరిశ్రమపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఈ పరిశ్రమ భద్రతా ప్రమాణాలను పాటించ కుండా నడపటం వాళ్ళే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమ పూర్తిగా నాసిరకంగా, ప్రమాణాలకు వ్యతిరేకంగా నిర్మించి లాభాల కోసమే యాజమాన్యం నడుపుతుంది.. ఈ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఎలాంటి కార్మిక చట్టాలు అమలు కావు. అంతరాష్ట్ర కార్మిక చట్టాలు అమలు అసలే కనిపించవు. తక్షణమే ఈ పరిశ్రమపై తక్షణమే పరిశ్రమ అధికారులు, లేబర్ అధికారులు ఉమ్మడిగా విచారణ జరిపి కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు జరిగిన ప్రమాదం లో గాయపడిన కార్మికులకు నాణ్యమైన, మెరుగైన చికిత్య అందించి వారిని రక్షించాలి..