
రైతు బంధు, వడ్ల డబ్బులు పాత బాకీల కింద జమ చేయడం మానుకోవాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్
జనగామ:స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు డిపాజిట్ ల నుండి 18 శాతం రైతులకు పంట రుణాలు ఇవ్వాలని జనగామ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్ గారికి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడుతూ
రైతుల పాత పంటల రుణాలు లక్షలోపు ఉన్నవారందరికి మాఫిచేసి, తిరిగి కొత్త ఋణాలు మంజూరి చేసి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, 2023-24 వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందునరైతులు వ్యవసాయం చేయడానికి ప్రస్తుతం పెట్టుబడి ఎరువులు, విత్తనాలు ముఖ్యమైనవని రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడులకు బ్యాంకు ఋణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డి వ్యాపారుల వద్ద నూటికి రూ|| 3 నుండి 5 రూపాయల వరకు అధిక వడ్డీలకు అప్పు తెస్తున్నారు. అదే విధంగా కొంత మంది రైతులకు సరియైన పెట్టుబడి పంట ఋణాలు అందడం లేదని. బ్యాంకులు ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్ల నుండి 18 శాతం పంట ఋణాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికి ఋణాలు ఇవ్వడం లేదని. ఇప్పటికైన ఋణాలు మంజూరి చేసి రైతులకు సహకరించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా
లక్ష్య లోపు పంట ఋణాలు ఏకకాలంలో తక్షణమే మాఫీ చేసి, రైతులకు తిరిగి కొత్త ఋణాలు ఇవ్వాలని కొత్త రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట ఋణాలు ఇవ్వాలని కౌలు రైతులకు ఋణాలు మంజూరు చేయాలని బ్యాంకులు ఋణాలు ఇచ్చినట్టు బుక్ అడ్జస్ట్మెంట్ విధానాన్ని ఆపాలని రైతు బంధు, వడ్ల డబ్బులు పాత బాకీల కింద జమచేయడాన్ని మానుకోవాలని కోరారు.