
ఈ69న్యూస్ వరంగల్ బ్యూరో రిపోర్ట్
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో “జై బాపు-జై భీమ్-జై సంవిధాన్” నినాదాలతో పాదయాత్ర నిర్వహించారు. గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగం అందించిన సమానత్వం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని ప్రోత్సహిస్తూ,రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి లకావత్ దన్వంతి,ఇతర నేతలు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.