
ఈ69న్యూస్ జనగామ:ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీ డి.ఎస్.వెంకన్న సుడిగాలి పర్యటనలో భాగంగా చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల,పాలకుర్తి మండలంలోని బొమ్మెర మరియు కొడకండ్ల మండలంలోని రేగుల గ్రామాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన సాదాబైనామ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు.ఆర్డీఓ వెంకన్న మాట్లాడుతూ..సిబ్బంది పారదర్శకతతో పని చేసి ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ఉండాలని సూచించారు.అలాగే 02-06-2014 లోపు తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన వ్యవసాయ భూములు గల అర్హత కల్గిన రైతులను గుర్తించి పూర్తి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్లు నాగేశ్వర్ రావు,చంద్రమోహన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.