
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి
ఈ69 న్యూస్ జనగామ/స్టేషన్ ఘనపూర్
ఈ నెల 16వ తేదీ న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనపూర్ (స్టేషన్) పర్యటనకు రానున్న సందర్భంగా చేపట్టాల్సిన పనులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆయా ప్రాంతాలు సందర్శించి తహసిల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.ముందుగా ఆర్టీసీ గ్రౌండ్స్ లో వంద పడకల ఆసుపత్రి,నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.త్వరగా స్థలాన్ని చదును చేయించాలన్నారు.సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో డిగ్రీ కాలేజ్ నిర్మాణం పనులు చేపట్టవలసి ఉన్నందున అందుకు అనువైన స్థలాన్ని సందర్శించి పరిశీలిస్తూ వెంటనే పరిశుభ్రం చేయించాలన్నారు.తదనంతరం పాలకుర్తి రోడ్డు లోని శివునిపల్లిలో స్థలాన్ని సందర్శించి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్బంగా శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతూ..ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మాట్లాడుతూ..800 కోట్ల రూపాయలతో ఘనపూర్ (స్టేషన్) నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని,అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలన్నారు.యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల,ప్రభుత్వ డిగ్రీ కళాశాల,బంజారా భవన్,సమీకృత రెవెన్యూ డివిజన్ కార్యాలయ సముదాయం,విద్యుత్ సబ్ స్టేషన్ లు,ఏడు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్లు,పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్లకు,చిల్పూర్,వేలేరు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయలకు స్థల పరిశీలన చేసి పెట్టుకోవాలన్నారు.అదే విధంగా ఆర్ఎస్ ఘన్పూర్ స్టేషన్ రిజర్వాయర్ నుండి నవాబ్ పేట రిజర్వాయర్ వరకు కాలువ నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు.ప్రణాళికాబద్ధంగా తగిన అన్ని అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను చేపడుతూ మ్యాపులను రూపొందించాలన్నారు.అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ ఏర్పాట్లను చేపట్టాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) రోహిత్ సింగ్,ఆర్డీఓలు గోపిరామ్,వెంకన్న,ఏసీపీ భీం శర్మ,ఆర్ అండ్ బి ఎస్.ఈ.వెంకటేశ్వరరావు ఇరిగేషన్ ఎస్.ఈ.సుధీర్,విద్యుత్ శాఖ ఎస్.డిపిఓ స్వరూప,డి.డబ్ల్యూ ఓ ఫ్లోరెన్స్,డిపిఓ స్వరూప,విద్యుత్ ఎస్ఈ వేణుమాధవ్,వివిధ శాఖల అధికారులు,పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.