
వరంగల్ బిషప్ ఉడుముల బాలకు ఘన సన్మానము

ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని విద్యా జ్యోతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరియు ఫాదర్ కొలంబో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు.ఈ సందర్భంగా
ముఖ్య అతిధిగా వరంగల్ మోస్ట్ రెవెర్న్డ్ ఉడుముల బాల పాల్గొని మాట్లాడారు.విద్యార్థులు క్రమశిక్షణతో చక్కగా చదివి తల్లి తండ్రుల ఆశలకు అనుగుణముగా జీవితము లో ఎదగాలని అందుకు ఫాదర్ కొలొంబో పాఠశాల(సీబీఎస్ సిలబస్ తో)చక్కని ప్రదేశమని,అవకాశమని చెప్పారు.ఈ సందర్బంగా విశాఖపట్నం అగ్ర పీఠాధిపతిగా బధీలి ఫై వెళ్ళనున్న వరంగల్ పీఠాదిపథి ఉడుముల బాలకు,విద్యా జ్యోతి డిగ్రీ కళాశాల మరియు ఫాదర్ కొలంబో పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు ఘన సన్మానము చేశారు.ఫాదర్ కొలంబో పాఠశాలలో యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేయడము జరిగింది.ఈ కార్యక్రముమ లో విద్యార్థులు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ థామస్ కిరణ్,అధ్యాపకులు,విద్యార్థులు,పేరెంట్స్ పాల్గొన్నారు.