
ఇప్పగూడెం,శివుని పెళ్లి,నమిలిగొండ,పామునూరు,తాటికొండ గ్రామాల్లో ఏర్పాట్లు
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి.ఇప్పగూడెం శివుని పెళ్లి,నమిలిగుండా,పామునూరు,తాటికొండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను మండల ఏటీఎం కడారి కుమారస్వామి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..“రైతులు సకాలంలో తమ ధాన్యాన్ని తీసుకురావాలి.కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాం”అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షులు,మండల కమ్యూనిటీ అసిస్టెంట్లు (సీఏలు),సీసీఎల్ సభ్యులు,అనేకమంది రైతులు పాల్గొన్నారు.రైతులు కొత్తగా ప్రారంభమైన ఈ కేంద్రాల ద్వారా సులభంగా ధాన్యం విక్రయించే అవకాశం పొందారని పేర్కొన్నారు.