ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్,జూన్ 26: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్‌గా రాధాకృష్ణ గురువారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ మరియు జనగామ జిల్లా కలెక్టర్ డా.రిజ్వాన్ భాషా షేక్‌లను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా సమర్థంగా పని చేయాలని ఆకాంక్షించారు.పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల,ప్రజాసేవలో పారదర్శకత,శుభ్రత,పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని రాధాకృష్ణ పేర్కొన్నారు.మున్సిపల్ సిబ్బంది,నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ తన పాలనలో అభివృద్ధి సాగాలని ఆకాంక్షించారు.