
telugu galam news e69news local news daily news today news
గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రం లో రైతు వేదిక కార్యాలయం లో అర్.డి.ఓ రామ్మూర్తి అధ్యక్షతన పంచాయతీరాజ్ మరియు గ్రామ పంచాయతి స్పెషల్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ కడియం శ్రీహరి.ఈ సందర్భంగా యం.ఎల్.ఎ మాట్లాడుతూ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.ఘనపూర్ మండల కేంద్రం లో సైడు కాల్వలు ఆపరిశుభ్రంగా ఉన్నాయని, ఫ్లై ఓవర్ బ్రిడ్జి క్రింద చట్ట విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపివేయలని, నాణ్యత గల డివైడర్ లను ,మరియు సెంటర్ లైటింగ్ లను ఏర్పాటు చేయాలన్నారు..వాటి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.అంబెడ్కర్ విగ్రహం నుండి శివునిపల్లి కి వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిన్నది దానిని మరమ్మత్తు చేయాలని ఆర్&బి అధికారులకు సూచించారు.అలాగే..
అండర్ రైల్వే బ్రిడ్జి క్రింద సీసీ రోడ్డు మరమ్మతులు కూడా చేయాలన్నారు.శివునిపల్లి మరియు ఘనపూర్ మార్కెట్లను ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.సర్వీస్ రోడ్ల పైన మెట్లు, ర్యాంపులు కడుతున్నారని, దానివల్ల వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.సర్వీస్ రోడ్డు మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్, ఇతరత్ర వాటిని మరొక ప్రదేశానికి షిఫ్టింగ్ చేయాలన్నారు.అలాగే బస్టాండ్ ప్రాంతంలో ఖాళీగా ఉన్న 2 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఆర్టీసీ అధికారులతో చర్చించి స్టేషన్ ఘనపూర్ కి మంజూరు అయిన 100 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే బస్టాండ్ ఆవరణలో మరియు శివునిపల్లి ట్రాక్ క్రింద కమ్యూనిటీ టాయిలెట్ ల ఏర్పాటు చేయాలని. మండల స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్తాయి సమాచారం తో ఉండాలన్నారు, నిబద్దత తో పని చేసే ప్రతి అధికారి కి నా ప్రోత్సాహం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.