ఈ69న్యూస్ స్టేషన్ ఘన్పూర్,జూన్ 26: స్టేషన్ ఘన్పూర్ కు నూతనంగా నియమితులైన మున్సిపల్ కమిషనర్ బి.రాధాకృష్ణ ను యువ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మున్సిపాలిటీలో నౄలకొన్న పలు సమస్యలను కమిషనర్ కు వివరించారు.ప్రత్యేకంగా కుడాయింపు,మురుగు కాలువల నిర్వహణ,శానిటేషన్ పనులలో లోపాలు,నగర పర్యావరణం మెరుగుపరచడం వంటి విషయాలపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు నీల మహేష్,కొండ వేణు,సృజన్ తదితరులు పాల్గొన్నారు.కమిషనర్ రాధాకృష్ణ ప్రజల సమస్యలను గమనించి,వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.