స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలానే సియం రేవంత్ రెడ్డి సంకల్పం చరిత్రత్మాకం
Uncategorizedతెలంగాణ పంచాయతీరాజ్ చట్టం -2018 సెక్షన్ 243D (6) ఆర్డినేన్స్ ద్వారా సవరణ చేసిరిజర్వేషన్స్ అమలు
ఈ నెల 21 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించి BJP ప్రభుత్వం బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి AK ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టబోయిన అనిల్ కుమార్.
జూన్ 13 E69 టీవీ // హాలియా
ఈ రోజు హాలియా పట్టణం లో తన నివాసం లో *A.K ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టెబోయిన అనిల్ కుమార్ * మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల లో బీసీ లకి 42 శాతం అమలుకు సియం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినేట్ ఆమోదం తెల్పి రాహుల్ గాంధీ బీసీల అభివృద్ధిన్ని ఆకాంక్షించి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన విద్యా, ఉద్యోగాలలో, స్థానిక సంస్థలలో బీసీ లకి 42 శాతం రిజర్వేషన్స్ అనే అంశాన్ని మాగ్న కార్ట లాగ భావించి రేవంత్ రెడ్డి సారద్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధి ని నిరూపించుకుంది.
బీసీ లకి స్థానిక సంస్థ ఎన్నికల లో 42 శాతం అమలుకు తెలంగాణ పంచాయతీ చట్టం -2018 సెక్షన్ 243D (6) ఆర్డినేన్స్ ద్వారా సవరణ చేసిరిజర్వేషన్స్ అమలు చేయాలని కసరత్తు చేయడం అభినందించదగ్గ విషయం.రిజర్వేషన్స్ అమలులో కోర్టులో ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ఎదుర్కొనాడానికి అన్ని పార్టీలు సహకరించి బీసీ ల అభివృద్ధి కి సహకరించాలని కోరారు.
ఈ నెల 21 నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్స్ బిల్లును ఆమోదించి BJP ప్రభుత్వం బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అదే విధంగా బీసీ ల 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని IX షెడ్యూల్ లో చేర్చి ఆమోదించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగం లో పొందుపరిచిన అంశం జనాభా ధమాషాల రిజర్వేషన్స్ అమలుకు తెలంగాణ లో బీసీ జనాభా 56 శాతం పై చిలుకు కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ న్యాయపరమైనది అని తెలియజేశారు.