స్ఫూర్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయo
స్ఫూర్తి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని చిల్లంచెర్ల ప్రధానోపాధ్యాయులు మంద జయ అన్నారు
స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ దాతలు వలపు శంకర్ సహకారం తోపిల్లలకు గ్రీన్ బోర్డ్,2ఫ్యాన్లు మరియు గాదె శ్యామ్ బాబు సహకారం తో స్పోర్ట్స్ డ్రెస్ అదే విదంగా ఫౌండేషన్ నుండి 10 వ తరగతి పిల్లలకు కంపాస్ బాక్స్ లు,స్కేల్, పెన్నులు అందచేశారు
ఈసందర్భంగా శ్రీధర్ రెడ్డి ,క్రిష్ణ మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాద్యాయులు రాయిపెల్లి యాకయ్య తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పిల్లలకు అవసరమయ్యే మెటీరియల్ అందిస్తున్నామని ఆదేవిదంగా ఈ పాఠశాల పిల్లలకు కూడా అందించడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు, యాకయ్య మాట్లాడుతూ పిల్లలకు బుధవారం,శనివారం దరించేటట్లు ప్రత్యేక టీ షర్ట్స్ అందించాలని కోరగా తప్పకుండా ప్రయత్నం చేస్తామన్నారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత,శ్రీనివాస్, రవీంద్రకుమార్,భాస్కర్, శ్యామ్సన్ సుధాకర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు,అనంతరం శ్రీధర్ రెడ్డి,క్రిష్ణ ని విద్యార్థులు శాలువా తో సత్కరించారు