మధిర 15వ వార్డులోని సిపిఎస్ స్కూల్లో 15 వార్డు కౌన్సిలర్ కోనా ధని కుమార్ స్వంత నిధులతో పైపులైన్ ఏర్పాటు చేయడం జరిగిందిఈరోజు 15వ వార్డులోని ప్రజలు సిపిఎస్ స్కూల్లోని పైపులైను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 వార్డులో అభివృద్ధి కోసం కోన దనికుమార్ స్వంత డబ్బుతో పైప్ లైన్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్ల పోతు ప్రసాద రావు, నకిరి కంటి గోవిందు, జంగాల మురళి, ch నరసింహారావు, సిద్దంశెట్టి సందీప్, సిపిఎస్ స్కూల్ హెచ్ఎం రామకృష్ణ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు