
hanumakonda news
హనుమకొండ: ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజలు తినే ఆహార పదార్థాల తయారీలో శుభ్రత పాటించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్వీట్ హౌస్ చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గేల తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి ఫుడ్ సేఫ్టీ, అండ్ కంట్రోల్ అధికారులకు బహిరంగ లేక విడుదల చేశారు.
సీట్ హౌస్ ల వద్ద స్వీట్ తయారు చేసేవారు చేతులకు బ్లౌజులు పెట్టుకోవడం లేదని, రెండు చేతులతో లడ్డూలను తయారు చేస్తున్నారని, తయారుచేసిన స్వీట్ పై ఈగలు వాలడం దుమ్ము పడటం, వాటిలో బ్యాక్టీరియా చేరడం జరుగుతుంది, బాగా మరిగించిన ఆయిల్ లోనే సమోసాలు, పకోడీ,మిర్చీలు, కాల్చడం, మరిగించిన నూనెను మళ్లీ తెల్లారి వాడటం జరుతుంది. ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్నారు. రోడ్లమీద జిలేబిలు తయారు అదే పద్ధతిలో జరుగుతుంది. నాలాల పక్కన మీద స్వీట్ హౌస్ నిర్వహణ చేయడం వల్ల అందులో ఉన్న దుర్గంధము ఈగలు దోమలు వాటి మీద చేరుతున్నాయి, బేకరీలలో నిలువ ఉంచిన పదార్థాలను కుళ్ళి పోయిన వాటిని అమ్ముతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెను వాడుతూ ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్నారు, చికెన్,మటన్ సెంటర్లలో మిగిలిన వాటిని తక్కువ ధరకు బిర్యాని సెంటర్లకు పంపించడం వాటిని వండి ప్రజలకు పెడుతున్నారు. నగరంలోని ప్రజల ప్రాణలతో చెలగాటమాడుతున్న బిర్యాని ఫాస్ట్ ఫుడ్ స్వీట్ హౌస్ బేకరీ తనిఖీలు నిర్వహించి,చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.