
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం రామన్నపేట గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రేపటి నుంచి నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో ను విజయవంతం చేయాలని. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మరియు టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.సమస్యలను గాలికి వదిలేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం కోసం పాకులాడుతున్నాయని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు 15 ఫైనన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసి గ్రామపంచాయతీల అభివృద్ధిని అడ్డుకుంటుందఅన్నారు. స్థానిక సంస్థలు అభివృద్ధి చెందాలని లక్ష్యంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రోజ్ గార్ యోజన పేరుతో ఒక పతకం తీసుకువచ్చిందని అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ వస్తుందని అన్నారు.నేడు పాలకులు గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించిన అన్ని పథకాలను నీరుగారుస్తూ నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే అనుకుంటే సర్పంచుల ఆత్మహత్యలూ పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేయించిన పనికి డబ్బులు రాక అప్పుల ఊబిలో కూరుకపోయి సర్పంచులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. వీటన్నిటిని ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ముందుకు వస్తే అక్రమ కేసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు.యావత్ తెలంగాణ సమాజం సమస్యలపై రేపటి నుండి హత్ సే హాత్ జోడో చేపట్టనున్నామని సర్పంచులందరూ బయటికి వచ్చి తమ ఘోడును ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా గర్జించాలని పిలుపునిచ్చారు.కింది స్థాయి నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజా సమస్యలపై పోరాడాలని హత్ సే హత్ జొడో తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వణుకు పుట్టాలని నాయకులకు సూచించారు.ప్రతి మండల నాయకులు తన మండలంలో ప్రతి గడపా తట్టాలని దిశానిర్దేశం చేశారు.