
ఈ69 న్యూస్ హనుమకొండ
హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఈదుల్ ఫితర్ పర్వదినాన్ని ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు.హన్మకొండ జిల్లాలోని బోడగుట్ట,ఆత్మకూర్ మండలం కటాక్ష పూర్,ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామాలలో,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ముస్లింలు ఈద్ గా,మస్జీద్,నమాజ్ సెంటర్లలో ప్రత్యేక నమాజ్ చేశారు.అనంతరం ఖాజీపేట రైల్వే స్టేషన్ ముందు సిటీ బస్టాండ్ లో కటాక్ష పూర్ ములుగు హైవే లో బస్సులో ప్రయాణం చేసే ప్రయాణీకు వెంకటాపురంలో మస్జిద్ ముందు సేమియా పాయసం పంపీణీ చేశారు.ఈ సందర్భంగా వరంగల్ మిషనరీ ఇంచార్జి మౌల్వీ అయాన్ పాషా,కటాక్ష పూర్ గ్రామ యువజన సమితి అధ్యక్షుడు సయ్యద్ ఇఫ్ తి కార్ మాట్లాడారు.రంజాన్ మాసం ఉపవాసాలు మానవుల పట్ల సానుభూతిని కలిగిస్తాయని అన్నారు.తోటి మానవుల పట్ల కరుణ సానుభూతి కలిగి ఉండడం గొప్ప ఆరాధన అని అలాగే దేవుని ప్రీతిని సంపాదించడానికి అద్భుతమైన మార్గమని అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పట్టణ అధ్యక్షులు ముహమ్మద్ సలీం,ఇక్బాల్,రియాజ్,రఫీ,దానియాల్,మహమూద్ పాష,ఉమర్ ఖాన్,సయ్యద్ మహమూద్ అహ్మద్,సయ్యద్ కరీం,హుస్సేన్,మౌలా,యాకూబ్,వలి,అక్బర్,ముజాహిద్,నేమత్,సిలార్,బషీర్,మొహిద్దిన్,ఆసిఫ్,సలహా మౌల,దావూద్,ఆదిల్,తలహా,ముబారక్,యాకూబ్,ఉస్మాన్,అక్బర్,రఫీ,గుంషావలీ,అజీమొద్దీన్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.