హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో -ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
నెరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో ఈనెల 2వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ హనుమాన్ పంచాయతన విగ్రహ శిఖర ప్రతిష్టాపన మహోత్సవానికి ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారికి దేశ్పాండే కుటుంబ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శివారెడ్డి, ఎంపిపి సజన్, జడ్పీటీసీ అనిల్ జాదవ్, సర్పంచ్ గాదె శంకర్ – సమత, కిష్టపూర్ సర్పంచ్ కరణ్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు నారాయణ్ సింగ్, భోజన్న గార్లతో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు