ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఎస్సీ బేడ బుడగ జంగాల కార్యనిర్వాహక అధ్యక్షుడు,మాజీ కార్పోరేటర్ చింతల యాదగిరి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కాళోజీ జంక్షన్ లో మైనంపల్లి హనుమంతరావు దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల యావత్తు తెలంగాణ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. అనంతరం మైనంపల్లిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతల రంగనాథ్ ,మోటం బాలకృష్ణ ,చింతల సంపత్ ,గంధం శ్రీనివాస్ ,తడమంచి రాములు ,వానరాశి రమేష్ ,సింపాటి చంద్రయ్య, సిరిగిరి హరి భూషణ్ ,చింతల శివప్రసాద్, చింతల అశోక్, మోతే శ్రీను పాల్గొన్నారు.