
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 9 వ డివిజన్లో అమృత టాకీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసి పాద యాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల చార్జ్ షీట్ ను, మరియు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల రూపంలో చేర వేయడం జరిగింది. కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…అమృత టాకీస్ దగ్గర ఉన్న 20 ఫీట్ల వెడల్పు ఉన్న పెద్ద మోరికి పై కప్పు లేక జనావాసాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూల్ కు వెళ్ళే క్రమమంలో మోరిలో పడే ప్రమాదం ఉందని, ఇదివరకు రెండు మూడు పర్యాయాలు ఇలా జరిగిందిందని కాలని వాసులు పేర్కొనడం జరిగింది.న్యూ రాయపురలో నాలలు సరిగా లేవు. 25 సంవత్సరాల క్రింద కట్టిన నాలాలె ఉన్నాయి. ఈ నాలను అభివృద్ధి పరచింది లేదు. నాల పక్కకు జానావాసాలు ఉండటం వలన మురుగు నీరు రావడంతో పిల్లలు వృద్ధులు అనారోగ్యం బారిన పడుతుతున్నరని తమ గోడును వెలిబుచ్చడం జరిగింది.సైడ్ డ్రైనేజీ సరిగా లేక మురుగు కాలువలు వ్యర్థ పదార్థాలతో నిండాయని మరుగు నీరు నిలిచి కాలనీ పరిసరాల్లో భరించలేని దుర్గంధం వస్తుందని అన్నారు.స్వచ్ఛ భారత్ అని ప్రచారం ఒకటే ప్రచారం చేస్తున్నారు . మేము తిరిగిన కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కేడే ఉందని పది పదిహేను రోజుల నుండి చెత్త తీసుకుపోవడం లేదని దీని వలన దుర్గంధభరితమైన వాసన వస్తుందని అన్నారు. మున్సిపల్ అధికారులకు పదే పదే ఎన్ని సార్లు చెప్పిన లాభం లేదని వాపోయారు.అభివృద్ధి పనుల కోసం గుంతలు అక్కడక్కడా గుంతలు తవ్వారు నిధులు లేక గుంతలను అట్లే ఉంచారు. రాత్ర్హి పూట గుంతలు ఏర్పడక గుంతల్లో పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు.అర్హత ఉన్న వారికి కూడా వృద్దాప్య పెన్షన్లు వికలాంగుల పెన్షన్ లు రావడం లేదని, వచ్చిన కూడా మూడు నాలుగు నెలలకోసారి వచ్చిన కూడా ఒకటే నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగిన కార్పొరేషన్ చుట్టూ తిరిగిన పట్టించుకునే నాథుడే లేదని విస్తుపోయారు.ఈ బి.ఆర్.ఎస్. నాయకులకు కార్పొరేటర్, ఎం.ఎల్.ఏ కి ముందు చూపు లేదని, కేవలం పేపర్ ల ప్రకటనలకే పరిమితం అయ్యారు వీరు మాటలకే కానీ చేతలకు కాదు, ప్రజా సంక్షేమం కోసం ఏమి చేయడం లేదు. వీళ్లకు పర్ సెంటజీ ల మీద ఉన్న ఇంట్రస్ట్ అభివృద్ధి పై లేదని కాంట్రాక్టర్ టెండర్ వేయాలంటే అధికారులకు ప్రజా ప్రతినిధులకు ముడుపులు ముట్ట చెప్పాల్సిందే. చిన్న చిన్న కాంట్రాక్టర్ ముడుపులు చెల్లించలేక పనులు జరగక అభివృద్ధి కుంటుబడుతుందని అన్నారు.ఈ ఎం.ఎల్.ఏ అభివృద్ధి చేయకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు? గ్రేటర్ వరంగల్ వరంగల్ కార్పొరేషన్ సమస్యలపై ఎందుకు శ్రద్ధ వహించడం లేదు. ఇన్ని సంవత్సరాలు ఎం.ఎల్.ఏ గా ఉండి ఏమి చేసారో ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఉద్యమ పార్టీ నుండి వచ్చాడని ప్రజలు పలుమార్లు ఎం.ఎల్.ఆ గా గెలిపిస్తే ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యం. కమీషన్లకు కక్కుర్తి పడుతూ అభివృద్ధి పనులలో అంతులేని అవినీతికి పాల్పడుతున్న టి.ఆర్.ఎస్. నేతలు తమ విధానాలు మానుకోవాలి.ప్రతి పక్ష నేతలు ప్రశ్నిచడం కోసమే ఉంటారు. ప్రశ్నిస్తే ప్రతి మాటకు అధికారం పక్షం సమాధానము చెప్పాలి కానీ విమర్శించడం అధికారపక్షానికి తగదని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు మహమ్మద్ జాఫర్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కో-ఆర్డినేటర్ సాంబ రాజు రాజ్ కుమార్ (పులి రాజు), శివ ప్రసాద్, వరుణ్ బాబు, ప్రణయ్ కుమార్, ప్రేంకుమార్, సోమయ్య, ఎజాస్, సుధాకర్, అనిల్, కార్పోరే టర్ పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఐటి వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మి ప్రసాద్, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, సీనియర్ నాయకులు తౌటం రవీందర్, ఐలయ్య, నల్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, మహమ్మద్ ముస్తాక్ నేహళ్, కేతిడి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.