
ఈ69న్యూస్ జనగామ
తెలంగాణలో హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతోంది.జనగామలో జరిగిన జిల్లా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు మాట్లాడుతూ,ఐదు లక్షల మందికిపైగా హమాలి కార్మికులు ఉండి కూడా వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన సంక్షేమం లభించడం లేదని విమర్శించారు.హమాలీలకు క్వింటాల్‌కు రూ.60 వేతనం అమలు,తాడు కట్టే పనికి అదనపు బొనస్,పిఎఫ్,ఈఎస్ఐ,ప్రమాద బీమా వంటి హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు.ఇంటి లేని హమాలీలకు ఇళ్లు ఇవ్వాలని కోరారు.మే 20న కేంద్ర కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెలో హమాలి కార్మికులు విస్తృతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.