
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పని భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని శ్రమదోపిడికి గురవుతున్న హమాలీలకు రక్షణగా చట్టం ఏర్పాటు చేయాలని ప్రగతిశీల తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు
శనివారం తల్లాడ మండల కేంద్రంలో ప్రగతిశీల తెలంగాణ హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లాకార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు. కే పుల్లారావు. అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వీరికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకపోవడం వల్ల శ్రమదోపిడికి గురవుతున్నారని వారు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర చట్టం చేయకపోవడం వల్ల పని ప్రదేశంలో కార్మికులకు ప్రమాదాలు జరిగితే ఎలాంటి నష్టపరిహారంలో ప్రభుత్వాలు గాని యాజమాన్యాలు కానీ అందించకపోవడం వల్ల కార్మికులు హార్దికంగా నష్ట పోయే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు పని భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. కే శ్రీనివాస్ .కార్యవర్గ సభ్యులు పటాన్ నాగుల మీరా .జై .రాంబాబు బి సత్యం తాళ్ల శ్రీను .శివ .తిరపయ్య. శోభన్ బాబు. రవి. డి. రమణ నాగయ్య. నాగేశ్వరరావు.తదితరులు పాల్గొన్నారు.