హెచ్ సీ యు భూముల వేలం వేయడం నిలిపి వేయాలి
Uncategorized
ఈ69న్యూస్ వరంగల్
హెచ్ సీ యు భూముల వేలం వేయడం నిలిపి వేయాలని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి డిమాండ్ చేశారు.మాల మహానాడు ఆఫ్ ఇండియా ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ మల్లికార్జున నగర్ లో మేడ్చల్ ప్రదేశ్ జిల్లా అధ్యక్షులు జిల్లా నరహరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రాంమూర్తి హాజరై ప్రసంగించారు.హెచ్ సీ యు భూముల వేలం వేయడం నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు.విద్యార్థులపై పోలీసు దౌర్జన్యం ఖండిస్తున్నామన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము వేలం వేయడాన్ని మాల మహానాడు ఖండిస్తుందన్నారు.భూముల వేలం అడ్డుకున్న విద్యార్థులను పోలీసులు పాషవీకంగా దౌర్జన్యం చేయడం అరెస్టు చేయడం దారుణమని,అరెస్టు చేసిన విద్యార్థులను బేసిరతగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు.ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుందని పేదలు నిలువ నీడకోసం గుడిసెలు వేసుకుంటే గుడిసెలు తగలబెట్టి వారిపై కేసులు పెట్టి నిర్బంధించారు కానీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వ ఆస్తులకు ఎక్కడ రక్షణ ఉంటుందన్నారు.తక్షణమే హెచ్సీయూ భూముల వేలం ఆపాలని అఖిలపక్షంతో చర్చలు జరపాలని విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు హెచ్ సి యు లాంటి విద్యా సంస్థల ద్వారా ఉన్నతమైన చదువులకు ఉపయోగపడే 400 ఎకరాల భూమిలో ఉన్నతంగా మరో యూనివర్సిటీనే నెలకొల్పి పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.అక్కడున్న గత స్వతంత్ర కాలం నుండి ఎవరు చేయని పని చేయడం దారుణమన్నారు.ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా కార్టూన్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ పసుల రాంమూర్తికి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల అష్ తోష్ బైరూ అనిల్ కుమార్ బండారి రవి పోర్కా శ్రీధర్ రామ్ మోహన్ దత్తాత్రేయ నారా హరి రావు తదితరులు పాల్గొన్నారు.